Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ .. 'రాధేశ్యామ్' రిలీజ్ డేట్ ఖరారు!

  • సంక్రాంతికి రిలీజ్ కావలసిన 'రాధే శ్యామ్'
  • కరోనా కారణంగా వాయిదా 
  • కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్ 
  • వచ్చేనెల 11వ తేదీన విడుదల  
Radhe Shyam Release date confirmed

ప్రభాస్ తాజా చిత్రంగా ప్రేక్షకులను పలకరించడానికి 'రాధేశ్యామ్' రెడీ అయింది. టి - సిరీస్ .. యూవీ క్రియేషన్స్ .. గోపీకృష్ణ మూవీస్ వారు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించాడు. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో విడుదల చేయాలనుకున్నారు.

కానీ ఆ సమయంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటం వలన వాయిదా వేశారు. ఇక తాజాగా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు. మార్చి 11వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టుగా చెబుతూ అధికారిక పోస్టర్ ను వదిలారు. ప్రేమకి .. విధికి జరిగే పోరాటాన్ని చూడమని ఈ పోస్టర్ ద్వారా చెబుతూ ఆసక్తిని రేకెత్తించారు.

భవిష్యత్తులో ఏం జరగనుందో తెలిసి కూడా దానిని మార్చడానికి కథానాయకుడు చేసే పోరాటమే ఈ కథ. ప్రభాస్ సరసన నాయికగా పూజ హెగ్డే  అలరించనుంది. ప్రభాస్ తల్లి పాత్రలో భాగ్యశ్రీ కనిపించనుండగా, ముఖ్యమైన పాత్రల్లో కృష్ణంరాజు .. జగపతిబాబు .. సత్యరాజ్ కనిపించనున్నారు. ఇక ఈ సినిమా ఏ స్థాయి రికార్డులకు తెర తీస్తుందో చూడాలి..

More Telugu News