APSBCL: రఘురామరాజు ఆరోపణలపై ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ స్పందన.. నివేదిక ఇవ్వాలని లేఖ

APSBCL writes letter to YCP MP Raghurama Krishna Raju
  • ఏపీలో విక్రయిస్తున్న మద్యంలో ప్రమాదకర రసాయనాలు ఉన్నాయన్న రఘురామ
  • ల్యాబ్‌ పరీక్షల్లో తేలిందన్న ఎంపీ
  • ఆ రిపోర్టు ఇవ్వాలంటూ ఏపీఎస్‌బీసీఎల్ ఎండీ లేఖ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ (ఏపీఎస్‌బీసీఎల్) స్పందించింది. చేసిన ఆరోపణలకు సంబంధించిన నివేదిక ఇవ్వాలని లేఖ రాసింది. రఘురామకృష్ణ రాజు ఇటీవల మాట్లాడుతూ.. ఏపీలో విక్రయిస్తున్న మద్యంలో ప్రమాదకర పదార్థాలు ఉన్నాయని ఆరోపించారు.

ఎస్‌జీఎస్ అనే కెమికల్ ల్యాబ్‌లో ఏపీలో విక్రయిస్తున్న మద్యానికి పరీక్షలు నిర్వహించగా అందులో ప్రమాదకర పదార్థాలు ఉన్న విషయం వెలుగుచూసినట్టు పేర్కొన్నారు. స్పందించిన ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి నిన్న రఘురామకు లేఖ రాస్తూ.. ఆ పరీక్షల వివరాలను ఇవ్వాలని కోరారు.
APSBCL
Raghu Rama Krishna Raju
Liquor

More Telugu News