Kareena Kapoor: సైఫ్, కరీనా ప్రేమకథ... మధ్యలో అక్షయ్ కుమార్ జోక్యం!

When Akshay Kumar warned Saif about Kareena
  • బాలీవుడ్ లో రొమాంటిక్ జోడీగా సైఫ్, కరీనా
  • ప్రేమ పెళ్లి చేసుకున్న సైఫ్, కరీనా
  • గతంలో తషాన్ చిత్రంలో నటించిన వైనం
  • కరీనాతో జాగ్రత్త అంటూ అక్షయ్ హెచ్చరిక
బాలీవుడ్ లో ఎంతో ప్రాచుర్యం పొందిన ప్రేమకథల్లో సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ ల వ్యవహారం కూడా ఒకటి. తొలుత అమృతా సింగ్ ను పెళ్లాడిన సైఫ్.. పిల్లలు కూడా పుట్టాక భార్యకు విడాకులు ఇచ్చేసి కరీనా కపూర్ ను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... ఓ బాలికలా తల్లితో కలిసి సైఫ్-అమృతా సింగ్ ల పెళ్లికి వెళ్లిన కరీనా... కాలక్రమంలో అదే సైఫ్ ను పెళ్లాడింది.

 ఇక అసలు విషయానికొస్తే... పదేళ్లుగా వీరి దాంపత్య జీవనం సాఫీగా సాగుతోంది. వీరికి తైమూర్, జహంగీర్ అనే పిల్లలున్నారు. ఇటీవల కరీనా... తన స్నేహితురాలు ట్వింకిల్ ఖన్నాతో చిట్ చాట్ సందర్భంగా ఆసక్తికర అంశం వెల్లడించింది.

సైఫ్ తో కలిసి తాను 'తషాన్' అనే చిత్రంలో నటించానని, అందులో అక్షయ్ కుమార్ తమ సహనటుడు అని కరీనా తెలిపింది. అయితే సెట్స్ పై తనతో సైఫ్ ఎంతో సన్నిహితంగా మెలుగుతుండడం గమనించి అక్షయ్ కుమార్... సైఫ్ ను హెచ్చరించాడని కరీనా వెల్లడించింది. "బేబో (కరీనా ముద్దుపేరు)తో జాగ్రత్త... ఆమె అసలే మంచిది కాదు... వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ అంతకంటే ప్రమాదకారులు" అని చెప్పాడని వివరించింది.

ఇంతలో ట్వింకిల్ ఖన్నా అందుకుని తాను కూడా ఆ సినిమా సెట్స్ పై ఉన్నానని తెలిపింది. కరీనా, సైఫ్ మధ్య ఏదో జరుగుతోందని తనకు కూడా అనిపించిందని పేర్కొంది. కాగా, ట్వింకిల్ ఖన్నాను అక్షయ్ కుమార్ ప్రేమ వివాహం చేసుకోవడం తెలిసిందే.
Kareena Kapoor
Saif Ali Khan
Akshay Kumar
Love Story

More Telugu News