సచిన్ తనయుడికి ఈసారైనా ఐపీఎల్ బరిలో దిగే అవకాశం దక్కేనా..?
- నిరుడు అర్జున్ ను కొనుక్కున్న ముంబయి ఇండియన్స్
- ఒక్క మ్యాచ్ లోనూ ఆడే అవకాశం రాని వైనం
- త్వరలో ఐపీఎల్ వేలం
- ఈసారి అర్జున్ కనీస ధర రూ.20 లక్షలు
కాగా, ఈసారి ఐపీఎల్ వేలంలో సచిన్ తనయుడు కూడా ఉన్నాడు. గత సీజన్ లో అర్జున్ టెండూల్కర్ ను ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ కొనుగోలు చేసినా, ఒక్క మ్యాచ్ లోనూ ఆడే అవకాశం రాలేదు. ఈసారి వేలంలో రూ.20 లక్షల కనీస ధరతో తన పేరు నమోదు చేసుకున్నాడు. ఫిబ్రవరి రెండో వారంలో వేలం ప్రక్రియ జరగనుండగా, అర్జున్ టెండూల్కర్ ను కొనుగోలు చేసే అంశం కూడా ఆసక్తి కలిగిస్తోంది.