ఒక్కో రైల్వే స్టేషన్ పరిధిలో ఒక ఉత్పత్తికి శ్రీకారం
- స్థానికంగా ఉపాధి అవకాశాల వెల్లువ
- బడ్జెట్ లో ప్రకటించిన మంత్రి నిర్మల
- 400 వందే భారత్ రైళ్లు పట్టాలపైకి
ఈ విషయాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రకటించారు. అలాగే, 400 వందే భారత్ రైళ్లను ప్రవేశపెడతామని తెలిపారు. వందే భారత్ రైలు 16 కోచ్ లతో అత్యాధునికంగా, బుల్లెట్ రైలును పోలి ఉంటుంది. ఇప్పటి వరకు రెండు వందే భారత్ రైళ్లను తయారు చేసి ఢిల్లీ-వారణాసి మార్గంలో ఒకటి, ఢిల్లీ-కాత్రా మార్గంలో మరొక దాన్ని నడిపిస్తున్నారు.