Andhra Pradesh: బిల్లుల ప్రాసెసింగ్‌లో నిర్లక్ష్యం వహించారంటూ.. 53 మంది ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం మెమోలు

Andhrapradesh Govt Issue charge memos to employees
  • కొత్త పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగుల ఆందోళన
  • 27 మందికి చార్జ్ మెమోలు, మిగతా వారికి మెమోల జారీ
  • ఉద్యోగుల వివరణతో సంతృప్తి చెందకుంటే క్రమశిక్షణ చర్యలు
పీఆర్సీపై ఆందోళన చేస్తున్న 53 మంది ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం మెమోలు జారీ చేసింది. కొత్త పీఆర్సీ ప్రకారం ఉద్యోగుల వేతనాల బిల్లులను ప్రాసెస్ చేయడంలో నిర్లక్ష్యం వహించారని ఆరోపిస్తూ ఈ మెమోలు జారీ చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. మొత్తం 53 మందిలో 27 మంది డీడీవోలు, ఎస్‌టీవోలు, ఏటీఓలకు చార్జ్ మెమోలు.. డిప్యూటీ డైరెక్టర్లు ముగ్గురు, సబ్ ట్రెజరీ అధికారులు 21 మంది, ఏటీవోలు ఇద్దరికి మెమోలు జారీ చేసింది.

జీతాల బిల్లులు పంపలేదని డీడీవోలకు, ట్రెజరీకి చేరిన బిల్లులు ప్రాసెస్ చేయనందుకు మిగిలిన ట్రెజరీ అధికారులకు ఈ మెమోలు ఇస్తున్నట్టు తెలిపింది. కాగా, మెమోలు అందుకునే ఉద్యోగులు ఇందుకు సంబంధించి ఉన్నతాధికారులకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. వారు సంతృప్తి చెందకుంటే కనుక క్రమశిక్షణ చర్యలకు సిద్ధం కావాల్సి ఉంటుంది.
Andhra Pradesh
PRC
Charge Memos
Employees

More Telugu News