Hyderabad: నిజాంపేటలోని హోలిస్టిక్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. రోగులు వేరే ఆసుపత్రికి తరలింపు

Fire Accident In Hyderabad kukatpally Holistic Hospital
  • మొదటి అంతస్తులో చెలరేగిన మంటలు
  • ప్రమాద సమయంలో ఆసుపత్రిలో 70 మంది రోగులు
  • సహాయక చర్యలను పర్యవేక్షించిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ
  • ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణం!
హైదరాబాద్ శివారు నిజాంపేటలోని హోలిస్టిక్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది. మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగి దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అంబులెన్స్‌ల ద్వారా రోగులను ఇతర ఆసుపత్రులకు తరలిస్తున్నారు.

ప్రమాద సమయంలో మొత్తం 70 మంది చికిత్స పొందుతున్నట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రమాదం కారణంగా ఎవరికీ ఎలాంటి అపాయం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు, సమాచారం అందుకున్న వెంటనే ఆసుపత్రి వద్దకు చేరుకున్న శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Hyderabad
Kukatpally
Holistic Hospital
Fire Accident

More Telugu News