Lioness: జూ సంరక్షకుడ్ని చంపి మగ సింహంతో కలిసి పారిపోయిన ఆడ సింహం

  • టెహరాన్ లో ఘటన
  • సింహాలకు ఆహారం అందించేందుకు వెళ్లిన సంరక్షకుడు
  • ఒక్కసారిగా దాడి చేసిన ఆడ సింహం
Lioness killed Zoo keeper and escaped with mate in Tehran

ఇరాన్ రాజధాని టెహరాన్ లో ఓ ఆడ సింహం జూలో సంరక్షకుడ్ని బలిగొంది. ఈ ఘటనపై జూ వర్గాలు మీడియాకు తెలిపాయి. ఆ ఆడ సింహం అనేక సంవత్సరాలుగా టెహరాన్ జూలో ఉంది. 40 ఏళ్ల వయసున్న జూ సంరక్షుకుడు ఒకరు సింహం ఉన్న ఎన్ క్లోజర్ లోకి ప్రవేశించాడు. దాంతో ఒక్కసారిగా అతడిపై ఆడ సింహం దాడి చేసింది. తీవ్రగాయాలపాలైన ఆ ఉద్యోగి మరణించాడు.

ఎన్ క్లోజర్ తలుపులు తెరిచి ఉంచడంతో ఆ ఆడ సింహం మరో మగ సింహంతో కలిసి తప్పించుకుని పారిపోయింది. దాంతో జూలో భయాందోళనలు నెలకొన్నాయి. భద్రతా బలగాలు వెంటనే జూని తమ అధీనంలోకి తీసుకున్నాయి. జూ అధికారులు వెంటనే స్పందించి తప్పించుకున్న సింహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు ఆ రెండు సింహాలను బంధించి ఎన్ క్లోజర్ లోకి తరలించారు.

More Telugu News