Mulayam Singh: బీజేపీలో చేరిన ములాయం సింగ్ సన్నిహితుడు!

Mulayam close aide joins BJP
  • అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యూపీలో వేడెక్కిన రాజకీయం
  • బీజేపీలో చేరిన ములాయం సన్నిహితుడు బేరియా
  • ఎస్పీ ఎమ్మెల్సీ రమేశ్ మిశ్రా కూడా బీజేపీలో చేరిక
కొన్ని రోజుల్లో యూపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి రాజకీయం వేడెక్కింది. జంప్ జిలానీలు కూడా పెద్ద సంఖ్యలో అటూఇటూ జంపింగ్ జపాంగ్ అంటున్నారు. తాజాగా, మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ కు అత్యంత సన్నిహితుడైన శివకుమార్ బేరియా ఈరోజు బీజేపీలో చేరారు. సమాజ్ వాదీ పార్టీ హయాంలో ఆయన మంత్రిగా కూడా పని చేశారు.

అలాగే, సమాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్సీ రమేశ్ మిశ్రా కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే... జనవరి 13న బీజేపీకి గుడ్ బై చెప్పి సమాజ్ వాదీ పార్టీలో చేరిన ఎమ్మెల్యే ధౌరారా మళ్లీ బీజేపీ గూటికి చేరారు. ములాయం కోడలు అపర్ణా యాదవ్ బీజేపీలో చేరిన తర్వాత ఈ పరిణామాలన్నీ చోటుచేసుకోవడం గమనార్హం.
Mulayam Singh
Samjwadi Party
BJP

More Telugu News