Raghu Rama Krishna Raju: రఘురామ పిటిషన్... ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ కు హైకోర్టు నోటీసులు

  • సునీల్ కుమార్ తనను టార్గెట్ చేశారన్న రఘురామ
  • ఆయనకు భార్యతో విభేదాలున్నాయని వెల్లడి
  • తనపై అపోహలు పెంచుకున్నారని ఆరోపణ
  • కౌంటర్ దాఖలు చేయాలని సునీల్ కుమార్ కు హైకోర్టు ఆదేశం   
AP High Court issues notice to AP CID Chief Sunil Kumar

ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ పై ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ నేపథ్యంలో ఏపీ హైకోర్టు చర్యలకు ఉపక్రమించింది. సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ కు నోటీసులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని సునీల్ కుమార్ ను హైకోర్టు ఆదేశించింది.

రఘురామ తన పిటిషన్ లో పలు అంశాలు పొందుపరిచారు. సునీల్ కుమార్ కు, ఆయన భార్యకు వివాదాలున్నాయని తెలిపారు. అయితే తన భార్యకు నేను మద్దతుగా ఉన్నానని సునీల్ కుమార్ అపోహపడుతున్నారని వివరించారు. ఈ కారణాలతోనే సునీల్ కుమార్ తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారని రఘురామ తన పిటిషన్ లో ఆరోపించారు. అంతేకాదు, ప్రైవేటుగా ఓ సంస్థ ఏర్పాటు చేసి క్రైస్తవ మతాన్ని,  మతమార్పిళ్లను ప్రోత్సహిస్తున్నారని కూడా నివేదించారు.

More Telugu News