Judges: ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా ఏడుగురుని సిఫారసు చేసిన సుప్రీం కొలీజియం

Seven new judges for AP High Court
  • ఏపీ హైకోర్టుకు భారీ సంఖ్యలో జడ్జిలు
  • ఈ నెల 29న కొలీజియం సమావేశం
  • సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలో సమావేశం
  • ఏడుగురి పేర్లను రాష్ట్రపతికి సిఫారసు చేసిన వైనం
ఏపీ హైకోర్టులో పెద్ద సంఖ్యలో న్యాయమూర్తులు నియమితులు కానున్నారు. ఏపీ హైకోర్టుకు కొత్తగా ఏడుగురు జడ్జిలను సిఫారసు చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 29న కొలీజియం సమావేశం జరగ్గా, న్యాయవాదులుగా కొనసాగుతున్న ఏడుగురిని ఇందుకోసం సిఫారసు చేసింది.

రవి చీమలపాటి, గన్నమనేని రామకృష్ణప్రసాద్, కొనకంటి శ్రీనివాసరెడ్డి, వడ్డిబోయిన సుజాత, సత్తి సుబ్బారెడ్డి, తర్లాడ రాజశేఖర్ రావు, నిమ్మగడ్డ వెంకటేశ్వర్లులను జడ్జిలుగా సిఫారసు చేశారు. వీరి పేర్లతో కూడిన జాబితాను కొలీజియం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు నివేదించింది.  

ఇదిలావుంచితే, ఏపీ హైకోర్టులో 37 జడ్జి పోస్టులు ఉండగా, ప్రస్తుతం 20 మందే పనిచేస్తున్నారు. తాజా సిఫారసులతో ఏపీ హైకోర్టులో జడ్జిల సంఖ్య 27కి పెరగనుంది.
Judges
AP High Court
Supreme Court
Collegium
NV Ramana
India

More Telugu News