Leopard: శ్రీశైలంలో చిరుత పులి సంచారం.. వణుకుతున్న సెక్యూరిటీ సిబ్బంది

Leopard spotted at Srisailam power plant CCTv footage
  • కుడిగట్టు విద్యుత్ కేంద్రం సమీపంలో సంచారం
  • ఒక కుక్కను వేటాడిన చిరుత
  • సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్
శ్రీశైలం కుడిగట్టు విద్యుత్ కేంద్రం సమీపంలో చిరుత సంచారం స్థానిక ప్రజలను ఆందోళనకు గురి చేసింది. ముఖ్యంగా విద్యుత్ ప్లాంట్ సెక్యూరిటీ సిబ్బంది భయంతో వణికిపోతున్నారు. ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఒక చిరుత పులి ఎడమగట్టు విద్యుత్ కేంద్రం సమీపంలో కనిపించింది. చిరుత ఒక కుక్కను వేటాడడం సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది.

చిరుత పులిని చూసిన సెక్యూరిటీ సిబ్బంది అటవీ శాఖకు సమాచారం ఇచ్చారు. గత కొన్ని రోజుల్లో చిరుతపులి సంచారంపై స్థానికులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, అప్రమత్తంగా ఉండాలంటూ అటవీ అధికారులు సూచించారు. శ్రీశైలం చుట్టుపక్కల నల్లమల పరిధిలో ఆసియాలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఏరియా ఉండడం గమనార్హం.
Leopard
spotted
Srisailam

More Telugu News