Priyamani: ఆ పాటలో సమంత చాలా హాట్ గా అనిపించింది: ప్రియమణి

Samantha looked hot to my husband also says Priyamani
  • సినీ పరిశ్రమలో చాలా మార్పులు వచ్చాయి
  • గతంలో హీరోయిన్లు గ్లామర్, రొమాన్స్ కే పరిమితం అయ్యేవారు
  • ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తున్నారు
  • ప్రేక్షకుల దృష్టి కోణం మారిందన్న ప్రియమణి 
ప్రస్తుతం సినీ పరిశ్రమలో చాలా మార్పులు వచ్చాయని, హీరోయిన్లకు కూడా మంచి ప్రాధాన్యత లభిస్తోందని దక్షిణాది భామ ప్రియమణి వ్యాఖ్యానించారు. గతంలో హీరోయిన్ అంటే కేవలం గ్లామరస్ గా కనిపించడం, పొట్టి బట్టలు ధరించి అందాలను ఆరబోయడం, పెద్ద హీరోల సరసన కేవలం రొమాన్స్ కే పరిమితం కావడం ఉండేదని... కానీ ఇప్పుడు ఎంతో మంది హీరోయిన్లు లేడీ ఓరియెంటెడ్ మూవీలు చేస్తున్నారని చెప్పారు. హీరోలకు పోటీగా హీరోయిన్లు లీడ్ రోల్స్ పోషించే రోజులు వచ్చాయని తెలిపారు. సమంత, నయనతారలు దీనికి ఒక ఉదాహరణ అని ఆమె చెప్పారు.

'పుష్ప' సినిమాలో సమంత చేసిన 'ఊ అంటావా' సాంగ్ సూపర్ హిట్ అయిందని ప్రియమణి అన్నారు. ఈ పాటలో సమంత కేవలం తనకు మాత్రమే కాకుండా తన భర్తకు కూడా చాలా హాట్ గా అనిపించిందని కితాబునిచ్చారు. ప్రేక్షకుల దృష్టికోణం మారిందని... హీరోయిన్లు చేసే అన్ని పాత్రలను వారు అంగీకరిస్తున్నారని చెప్పారు. తాజాగా ఓ ఇంటర్య్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు పెళ్లి తర్వాత కూడా పలు సినిమాలతో ప్రియమణి బిజీగా ఉంటున్నారు. టీవీ షోలలో కూడా హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు 'ఆహా'లో ప్రసారం కానున్న తెలుగు వెబ్ సిరీస్ 'భామా కలాపం'తో త్వరలోనే ఆమె ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
Priyamani
Samantha
Tollywood

More Telugu News