Bharat Bhushan: ప్రముఖ ఫొటోగ్రాఫర్ భరత్ భూషణ్ మృతి.. సీఎం కేసీఆర్ సంతాపం

KCR pays condolences to Bharat Bhushan
  • నిన్న అర్ధరాత్రి కన్నుమూసిన భరత్ భూషణ్
  • ఫొటోగ్రఫీ ద్వారా కల్చరల్ అంబాసడర్ ఆఫ్ తెలంగాణగా ఎదిగిన భరత్
  • తెలంగాణ ఒక అరుదైన ఫొటో జర్నలిస్టును, చిత్రకారుడిని కోల్పోయిందన్న కేసీఆర్

ప్రముఖ ఫొటోగ్రాఫర్ గుడిమల్ల భరత్ భూషణ్ తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన అర్ధరాత్రి ఒంటి గంటకు మృతి చెందారు. ఆయన వయసు 66 సంవత్సరాలు. వరంగల్ లో గుడిమల్ల అనసూయ, లక్ష్మీనారాయణ దంపతులకు ఆయన జన్మించారు. చిన్నప్పటి నుంచి ఫొటోగ్రఫీపై ఆసక్తిని పెంచుకున్న ఆయన చివరి వరకు అదే దారిలో ప్రయాణించారు. ఫొటోగ్రఫీ ద్వారా ఆయన కల్చరల్ అంబాసడర్ ఆఫ్ తెలంగాణగా ఎదిగారు.

గుడిమల్ల భరత్ భూషణ్ మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల జీవన శైలిని, చారిత్రక ఘట్టాలను, సంస్కృతిని తన ఛాయా చిత్రాలు, ఆర్ట్ ద్వారా ప్రపంచానికి తెలియజేశారని కొనియాడారు. దశాబ్దాల పాటు ఆయన చేసిన కృషి చాలా గొప్పదని అన్నారు. భరత్ మరణంతో తెలంగాణ ఒక అరుదైన ఫొటో జర్నలిస్టును, చిత్రకారుడిని కోల్పోయిందని చెప్పారు. భరత్ భూషణ్ కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

  • Loading...

More Telugu News