Ramesh Varma: 'ఖిలాడీ' సినిమా రిలీజ్ కాకముందే దర్శకుడికి కోటి విలువైన కారు బహమతిగా ఇచ్చిన నిర్మాత

Khiladi director Ramesh Varma gets Range Rovar from producer
  • రవితేజ హీరోగా 'ఖిలాడీ'
  • రమేశ్ వర్మ దర్శకత్వంలో చిత్రం
  • దర్శకుడికి రేంజ్ రోవర్ బహూకరించిన నిర్మాత
  • కారు ఖరీదు రూ.1.15 కోట్లు
రవితేజ, డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి నటించిన చిత్రం 'ఖిలాడీ'. ఈ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రానికి రమేశ్ వర్మ దర్శకుడు. రాక్షసుడు చిత్రంతో తన ప్రతిభను చాటుకున్న రమేశ్ వర్మ... రవితేజతో ఖిలాడీ తెరకెక్కించాడు. ఈ చిత్రం ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే, ఈ చిత్ర నిర్మాత కోనేరు సత్యనారాయణ దర్శకుడు రమేశ్ వర్మకు ఎంతో విలువైన కానుక ఇవ్వడం ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది. రూ.1.15 కోట్ల విలువ చేసే రేంజ్ రోవర్ కారును రమేశ్ వర్మకు బహూకరించారు. 'ఖిలాడీ' సినిమా కచ్చితంగా హిట్ అవుతుందన్న ధీమా ఉంటేనే నిర్మాత అంత విలువైన బహుమతి ఇచ్చి ఉంటాడని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
Ramesh Varma
Range Rovar
Koneru Satyanarayana
Khiladi
Raviteja
Tollywood

More Telugu News