Manipur: మణిపూర్ లో ఒంటరిగానే పోటీ.. అన్ని స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

BJP To Contest Solo In Manipur Announces Names For All 60 Seats
  • సొంత నియోజకవర్గం నుంచే సీఎం బీరేన్ సింగ్
  • మళ్లీ అధికారంలోకి వస్తామన్న కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్
  • పార్టీ కోసం పనిచేసిన వారికే టికెట్లు ఇచ్చామని కామెంట్

మణిపూర్ లో ఒంటరిగానే పోటీ చేయాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నిర్ణయించింది. మొత్తం 60 నియోజకవర్గాల్లోనూ పోటీకి నిశ్చయించుకుంది. ఈ మేరకు ఇవాళ పార్టీ 60 మంది అభ్యర్థులను ప్రకటించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్.. తన సిట్టింగ్ స్థానం హేంగాంగ్ నియోజకవర్గం నుంచే బరిలోకి దిగనున్నారు.

మణిపూర్ లో మళ్లీ తామే అధికారంలోకి వస్తామని అభ్యర్థుల జాబితా ప్రకటించే సందర్భంగా కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. బీజేపీ హయాంలోనే మణిపూర్ ప్రశాంతంగా ఉందని, అభివృద్ధి జరుగుతోందని భూపేందర్ యాదవ్ అన్నారు. దీర్ఘకాలంపాటు బీజేపీ కోసం పనిచేసిన వారికే టికెట్ ఇచ్చామని చెప్పారు. క్రీడాకారులు, అధికారులు, విద్యావేత్తలకూ టికెట్లు ఇచ్చామని వెల్లడించారు. కాగా, ఫిబ్రవరి 27, మార్చి 3న రెండు విడతల్లో మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

  • Loading...

More Telugu News