జేఈఎమ్ కమాండర్ జాహిద్ వనీ సహా ఐదుగురు ఉగ్రవాదుల హతం
- పుల్వామాలోని నైరా, బుద్గామ్ జిల్లాలో ఎన్‌కౌంటర్
- మరో పాకిస్థానీ ఉగ్రవాది కోసం గాలింపు
- భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం
భద్రతా బలగాల చేతిలో హతమైన ఉగ్రవాదులంతా లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థలకు చెందిన వారని పోలీసులు వివరించారు. తప్పించుకుపారిపోయిన మరో పాకిస్థానీ ఉగ్రవాది కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయని చెప్పారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతాల్లో భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో భద్రతా సిబ్బందికి ఎటువంటి గాయాలు కాలేదని వివరించారు.