RTC Employees: ఆ ఉద్దేశంతోనే పీఆర్సీ సాధన సమితి మమ్మల్ని లాగే ప్రయత్నం చేస్తోంది: ఆర్టీసీ వైఎస్సార్ ఉద్యోగ సంఘం

We will not part in ap sadhana samithi strike said APSRTC YSRCP Union
  • ఆర్టీసీ బస్సులు ఆగితేనే సమ్మె ప్రభావం కనిపిస్తుందని భావిస్తున్నారు
  • వారి సమ్మెలో మేం పాల్గొనడం లేదు
  • ఆర్టీసీలో 80 శాతానికి పైగా ఉద్యోగులు వ్యతిరేకిస్తారని భావన
పీఆర్సీ సాధన సమితి తమను సమ్మెలోకి లాగే ప్రయత్నం చేస్తోందని, దాని ప్రయత్నాలు ఫలించవని ఆర్టీసీ (పీటీడీ) వైఎస్సార్ ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చల్లా చంద్రయ్య తేల్చి చెప్పారు. నిన్న విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక వర్గ సమావేశం నిర్వహించారు. అనంతరం చంద్రయ్య మాట్లాడుతూ.. ఆర్టీసీ బస్సులు ఆగితేనే సమ్మె ప్రభావం కనిపిస్తుందని పీఆర్సీ సాధన సమితి భావిస్తోందని పేర్కొన్నారు.

పీఆర్సీ సాధన సమితి సమ్మెలో తాము పాల్గొనబోవడం లేదని స్పష్టం చేశారు. 50 వేల మంది వరకు ఉన్న ఆర్టీసీ ఉద్యోగుల్లో 14 వేల మందికిపైగా తమ సంఘంలో సభ్యులుగా ఉన్నట్టు చెప్పారు. ఆర్టీసీలో 80 శాతానికిపైగా సాధారణ ఉద్యోగులు సమ్మెను వ్యతిరేకిస్తారని భావిస్తున్నట్టు చెప్పారు. ప్రతి జిల్లాకు తిరిగి సమ్మెను ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తామని ఆర్టీసీ  ఉద్యోగ సంఘం నేతలు పేర్కొన్నారు.
RTC Employees
Andhra Pradesh
Srike
APSRTC

More Telugu News