అతడు పాడుతుంటే సంగీతం అవసరంలేదు... అతడే ఓ సంగీతం: అల్లు అర్జున్

29-01-2022 Sat 20:29
  • బ్లాక్ బస్టర్ హిట్టయిన పుష్ప
  • ఆనందోత్సాహాల్లో బన్నీ
  • ట్విట్టర్ లో ఆసక్తికర పోస్టు
  • ప్రీ రిలీజ్ ఈవెంట్ నాటి ఘటనపై బన్నీ కామెంట్స్
Allu Arjun heaps praise in young singer Sid Sriram
పుష్ప చిత్రం తిరుగులేని హిట్ కావడంతో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాయిగా సేదదీరుతున్నాడు. ఈ క్రమంలో అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఆసక్తికర అంశాన్ని పంచుకున్నాడు. ప్రముఖ యువ గాయకుడు సిద్ శ్రీరామ్ ను ఆకాశానికెత్తేశాడు.

"నాకు లభించిన విరామ సమయంలో ఈ విషయం రాయాలనిపించింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నా సోదరుడు సిద్ శ్రీరామ్ స్టేజిపై 'శ్రీవల్లి' పాట పాడుతున్నాడు. సంగీత వాద్య సహకారం లేకుండానే పాట మొదలుపెట్టాడు. సిద్ గొంతులో పాట ఊపందుకోవడంతో ఇక సంగీతం కూడా మొదలవుతుందిలే అని ఎదురుచూస్తున్నాను.

కానీ ఎంతకీ సంగీతం వాద్యాలు వినిపించలేదు సరికదా, అవేవీ లేకుండానే సిద్ పాడుతున్నాడు. నాకు మతిపోయింది. నిజంగా ఎంతో అద్భుతంగా పాడాడు. అతడు పాడుతుంటే సంగీతం అవసరంలేదు... అతడే ఓ సంగీతం అని నాకప్పుడు అనిపించింది" అంటూ ట్వీట్ చేశారు.