Bopparaju: ప్రభుత్వం చిత్తశుద్ధితో ఒక్కడుగు ముందుకు వస్తే మేం నాలుగడుగులు వేస్తాం: బొప్పరాజు

  • డిమాండ్ల సాధన కోసం ఉద్యోగుల ఆందోళనలు
  • విజయనగరం కలెక్టరేట్ వద్ద రిలే దీక్షలు
  • హాజరైన బొప్పరాజు వెంకటేశ్వర్లు
  • ఉద్యోగులకు మద్దతు
Bopparaju attends employees relay hunger strikes in Vijayanagaram

పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో డిమాండ్ల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద కొనసాగిస్తున్న ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలకు ఏపీ ఉద్యోగుల జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఉద్యోగులకు ఆయన సంఘీభావం ప్రకటించారు. అన్నింటికి సిద్ధపడే ఉద్యమబాట పట్టామని స్పష్టం చేశారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఒక్కడుగు ముందుకు వస్తే తాము నాలుగడుగులు వేస్తామని అన్నారు.

తాము చర్చలకు రావడంలేదని ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని, 9 మంది ఉద్యోగ సంఘ నేతలు వెళ్లి చర్చల్లో పాల్గొని డిమాండ్లను చెప్పడం నిజం కాదా? అని ప్రశ్నించారు. తమ డిమాండ్లకు ప్రభుత్వం లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని బొప్పరాజు పేర్కొన్నారు.

జీవోల్లో శాస్త్రీయత లేదని మీరే అంటున్నారు... అలాంటప్పుడు వాటిని సరిదిద్దాలని బొప్పరాజు పేర్కొన్నారు. ఫిబ్రవరి 3న తాము చేపట్టే ఛలో విజయవాడ కార్యక్రమం చూశాకయినా ప్రభుత్వ నిర్ణయం మారాలి అని వ్యాఖ్యానించారు.

More Telugu News