Peethala Sujatha: బయటకు రావాలంటేనే మహిళలు భయపడే స్థితి వుంది: పీతల సుజాత

Jagan is a man who didnt given security to his sister says Peethala Sujatha
  • అత్యాచారాల విషయంలో ఏపీ రెండో స్థానంలో ఉంది
  •  జగన్ సీఎం అయ్యాక 1,500 అత్యాచారం కేసులు నమోదయ్యాయి
  • నేరగాళ్లకు ఫ్రెండ్లీ స్టేట్ గా ఏపీ మారిపోయిందన్న సుజాత 

సొంత చెల్లెలు షర్మిలకే ముఖ్యమంత్రి జగన్ రక్షణ ఇవ్వలేక పోతున్నారని.. ఇక రాష్ట్రంలోని ఇతర మహిళలకు ఏం రక్షణ కల్పిస్తారని టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి పీతల సుజాత విమర్శించారు. మహిళలపై అత్యాచారాల విషయంలో దేశంలో ఏపీ రెండో స్థానంలో ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బయటకు రావాలంటేనే మహిళలు భయపడే స్థితి ఏపీలో ఉందని అన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అత్యాచారం చేయాలంటే భయపడే పరిస్థితి ఉండేదని... జగన్ సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో 1,500 అత్యాచారం కేసులు నమోదయ్యాయని చెప్పారు. నేరగాళ్లకు ఫ్రెండ్లీ స్టేట్ గా ఏపీ మారిపోయిందని అన్నారు.

  • Loading...

More Telugu News