Atchannaidu: పాడిరైతుల సమస్యలపై సీఎం జగన్ కు అచ్చెన్నాయుడు లేఖాస్త్రం

Atchannaidu wrote CM Jagan on dairy farmers problems
  • అమూల్ పై ఉన్న శ్రద్ధ పాడిరైతులపై చూపడంలేదని విమర్శలు
  • రూ.4 బోనస్ హామీ ఏమైందన్న అచ్చెన్న
  • ఉపాధి హామీ నిధులు మళ్లిస్తున్నారని ఆరోపణ
ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు రాష్ట్రంలోని పాడి రైతుల పరిస్థితులపై స్పందించారు. పాడిరైతుల సమస్యలపై సీఎం జగన్ కు లేఖాస్త్రం సంధించారు. పాడిరైతులకు ఇస్తామన్న రూ.4 బోనస్ హామీ ఏమైందని నిలదీశారు. అమూల్ పై చూపుతున్న శ్రద్ధ రాష్ట్రంలోని పాడిరైతులపై ఎందుకు చూపడంలేదని ప్రశ్నించారు. అమూల్ సంస్థ కోసం ఉపాధి హామీ నిధులను కూడా దారిమళ్లిస్తున్నారని అచ్చెన్న ఆరోపించారు.

అమూల్ వల్ల రూ.5 నుంచి రూ.20 వరకు అదనపు లబ్ది అనేది అవాస్తవం అని అన్నారు. సహకార డెయిరీ రంగాన్ని నిర్వీర్యం చేసే కుట్రకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
Atchannaidu
Dairy Farmers
CM Jagan
Amul

More Telugu News