Chiranjeevi: అమ్మా.. క్వారంటైన్లో ఉండటం వల్ల నీ ఆశీస్సులు తీసుకోలేకపోతున్నా: చిరంజీవి

Chiranjeevi greets his mother on her birthday
  • ఈరోజు చిరంజీవి మాతృమూర్తి పుట్టినరోజు
  • కరోనా నేపథ్యంలో స్వీయ నిర్బంధంలో ఉన్న చిరు
  • మరు జన్మలకు కూడా నీ చల్లని దీవెనలు కావాలని తల్లిని కోరిన చిరంజీవి
తన తల్లి పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగంతో కూడిన శుభాకాంక్షలను తెలియజేశారు. ఇటీవల చిరంజీవి కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. దీంతో, ప్రస్తుతం ఆయన సెల్ఫ్ క్వారంటైన్ లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఈ రోజు తన మాతృమూర్తి పుట్టినరోజు సందర్భంగా ఆయన ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

'అమ్మా... జన్మదిన శుభాకాంక్షలు. క్వారంటైన్ అయిన కారణంగా నీ ఆశీస్సులు ప్రత్యక్షంగా తీసుకోలేక ఇలా తెలుపుతున్నా. నీ చల్లని దీవెనలు ఈ జన్మకే కాదు, మరు జన్మలకి కూడా కావాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ.. అభినందనలతో... శంకరబాబు' అని ట్వీట్ చేశారు.

చిరంజీవి అసలు పేరు శివశంకర వరప్రసాద్ అనే విషయం తెలిసిందే. ఆయనను తల్లి ప్రేమగా 'శంకరబాబూ' అంటూ పిలుచుకుంటారు. అందుకే తన తల్లికి శుభాకాంక్షలను తెలిపే క్రమంలో తన పేరును ఆయన శంకరబాబు అని పేర్కొన్నారు.
Chiranjeevi
Mother
Birthday
Tollywood

More Telugu News