చంద్రుడిపై పరిశోధనల కోసం కారును సిద్ధం చేస్తున్న టయోటా

29-01-2022 Sat 09:19
  • 2040 నాటికి చంద్రుడిపై నివసించడమే లక్ష్యంగా పరిశోధనలు
  • జపాన్ అంతరిక్ష సంస్థతో చేతులు కలిపిన టయోటా
  • లూనార్ క్రూయిజర్‌గా కారుకు నామకరణం
Toyota is developing Lunar Cruiser to drive on Moon and Mars
2040 నాటికి చంద్రుడిపై, ఆ తర్వాత అంగారకుడిపై ప్రజలు నివసించడమే లక్ష్యంగా జపాన్ అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన ప్రయోగాల్లో ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా కూడా చేతులు కలిపింది. జాబిల్లిపై ప్రయోగాల కోసం ఓ కారును సిద్ధం చేస్తోంది. దీనికి ‘లూనార్ క్రూయిజర్’ అని పేరు పెట్టారు.

సాధారణంగా కార్లలో ప్రజలు ఏ ఇబ్బందీ లేకుండా ఏదైనా తినడమే కాకుండా పనిచేయడం, నిద్రపోవడం, ఇతరులతో కమ్యూనికేట్ చేయడం వంటి పనులు చేయగలుగుతారు. రోదసీలోనూ అచ్చంగా ఇదే సూత్రం వర్తిస్తుందన్న ఉద్దేశంతో ఈ ప్రయోగం చేపట్టారు. అంతేకాదు, రోదసిలో తనిఖీలు చేయడం, నిర్వహణ, పనులు చేసేందుకు ఈ లూనార్ క్రూయిజర్‌కు ఓ రోబోటిక్ చేతిని కూడా అమరుస్తున్నారు. గిటాయ్ జపాన్ అనే సంస్థ దీనిని అభివృద్ధి చేసింది.