Pass Port: అచ్చెన్నాయుడి పాస్‌పోర్టును పునరుద్ధరించండి: ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఆదేశం

  • పాస్‌పోర్టు గడువు ముగియడంతో దరఖాస్తు చేసుకున్న అచ్చెన్నాయుడు
  • కేసులు ఉండడంతో రెన్యువల్‌కు నిరాకరించిన కార్యాలయం 
  • ప్రత్యేక కోర్టును ఆశ్రయించిన అచ్చెన్న 
Make Renual of Kinjarapu Atchannaidu Pass Port court Orders

తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడి పాస్‌పోర్టును పునరుద్ధరించాలని విజయవాడలోని ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టు ఆదేశించింది. తన పాస్‌పోర్టు గడువు ముగియడంతో అచ్చెన్నాయుడు ఇటీవల రెన్యువల్  కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే, ప్రజాప్రతినిధుల కోర్టులో ఆయనపై కేసులు ఉండడంతో పునరుద్ధరించడం సాధ్యం కాదని పాస్‌పోర్టు కార్యాలయ అధికారులు తేల్చిచెప్పారు.

దీంతో అచ్చెన్నాయుడు కోర్టును ఆశ్రయించారు. తన పాస్‌పోర్టును రెన్యువల్ చేయాలని ఆదేశించాల్సిందిగా కోరారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు విన్న ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు.. అచ్చెన్నాయుడి పాస్‌పోర్టును పునరుద్ధరించాలని పాస్‌పోర్టు కార్యాలయ అధికారులను ఆదేశించింది.

More Telugu News