క్రికెట్ మైదానంలో 'పుష్ప' మేనియా.. వీడియో ఇదిగో!

28-01-2022 Fri 21:53
  • అల్లు అర్జున్ హీరోగా పుష్ప
  • క్రీడా రంగంలనూ బన్నీ క్రేజ్
  • శ్రీవల్లి పాటకు క్రికెటర్ల స్టెప్పులు
  • వీడియోలు వైరల్
Pushpa mania in cricket field
అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రం తెలుగు రాష్ట్రాలు దాటి ఖండాంతరాలకు వ్యాపించడమే కాదు, క్రీడా రంగంలోనూ ఉర్రూతలూగిస్తోంది. ముఖ్యంగా, క్రికెట్ వర్గాల్లో పుష్ప క్రేజ్ అంతాఇంతా కాదు. క్రికెటర్లు పర్సనల్ వీడియోలు చేయడం అటుంచితే, మైదానంలోనూ శ్రీవల్లి పాట స్టెప్పులు వేస్తూ ఆటగాళ్లు సందడి చేస్తున్నారు.

తాజాగా బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో పలువురు ఆటగాళ్లు వికెట్ పడినప్పుడు శ్రీవల్లి పాటలో అల్లు అర్జున్ లా కాళ్లు ఈడుస్తూ స్టెప్పులేస్తున్నారు. ఈ ట్రెండ్ ఇప్పుడు వైరల్ గా మారింది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో స్టార్ ఆటగాళ్లు డ్వేన్ బ్రావో తదితరులు పుష్ప డ్యాన్సులతో అలరిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను సినీ విశ్లేషకుడు కేఆర్కే పంచుకున్నాడు.