తెలంగాణలో కొత్తగా 3,877 కరోనా పాజిటివ్ కేసులు

28-01-2022 Fri 20:30
  • గత 24 గంటల్లో 1,01,812 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 1,189 కేసులు
  • రాష్ట్రంలో ఇద్దరి మృతి
  • ఇంకా 40,414 మందికి చికిత్స
Telangana corona daily report
తెలంగాణలో కరోనా వ్యాప్తి నిలకడగా కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 1,01,812 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా... 3,877 కొత్త కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1,189 కేసులు నమోదు కాగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 348, రంగారెడ్డి జిల్లాలో 241, హనుమకొండ జిల్లాలో 140, నల్గొండ జిల్లాలో 133 కేసులు గుర్తించారు.

అదే సమయంలో 2,981 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,54,976 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,10,479 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 40,414 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 4,083కి పెరిగింది.