Shweta Tiwari: దేవుడిపై వ్యాఖ్యల పట్ల క్షమాపణలు చెప్పిన టీవీ నటి శ్వేతా తివారీ

TV actress Shweta Tiwari apologizes for her comments
  • వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టీవీ నటి
  • వెల్లువెత్తిన ప్రజాగ్రహం
  • స్పందించిన శ్వేతా తివారీ
  • వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని వెల్లడి
బుల్లితెర నటి శ్వేతా తివారీ తన లోదుస్తుల విషయంలో దేవుడిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఆగ్రహావేశాలు రేకెత్తించడం తెలిసిందే. తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో శ్వేతా తివారీ నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించింది. తన వ్యాఖ్యలు ఎవరినీ బాధపెట్టాలని చేసినవి కావని, కానీ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నందున క్షమాపణలు చెబుతున్నానని ఓ ప్రకటన చేసింది.

తన సహనటుడు గతంలో చేసిన పాత్రను ఉద్దేశించి తాను వ్యాఖ్యానించగా, దాన్ని తప్పుగా అన్వయించుకున్నారని శ్వేతా తివారీ వివరణ ఇచ్చింది. సాధారణంగా నటులను వారు పోషించిన పాత్రల పేరుతో పిలుస్తుంటారని, ఈ వ్యాఖ్యలు కూడా ఆ కోణంలో చేసినవేనని వెల్లడించింది. అయితే తాను దేవుడ్ని విశ్వసిస్తానని, దేవుడి పేరిట ఎవరినీ నొప్పించేందుకు ప్రయత్నించనని స్పష్టం చేసింది.

కాగా, శ్వేతా వ్యాఖ్యలతో మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా మండిపడ్డారు. ఆమె వ్యాఖ్యలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆయన భోపాల్ సీపీని కోరారు. ఈ నేపథ్యంలో సదరు బుల్లితెర నటిపై భోపాల్ లో కేసు నమోదైనట్టు తెలుస్తోంది.
Shweta Tiwari
God
Comments
Apology

More Telugu News