కోలీవుడ్ లో కొత్త రికార్డు సెట్ చేసిన 'పుష్ప'

28-01-2022 Fri 17:40
  • క్రితం నెలలో వచ్చిన 'పుష్ప'
  • వివిధ భాషల్లో వసూళ్ల జోరు
  • ఓటీటీ నుంచి భారీ రెస్పాన్స్ 
  • త్వరలో 'పుష్ప 2' షూటింగ్ మొదలు  
Pushpa movie update
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన 'పుష్ప' సినిమా, క్రితం నెల 17వ తేదీన థియేటర్లకు వచ్చింది. తొలి రోజున నెగెటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, ఆ తరువాత దారిలో పడిపోయింది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాలో కథానాయికగా రష్మిక అలరించింది. ఎర్రచందనం అక్రమ రవాణా చుట్టూ ఈ కథ తిరుగుతుంది.

తెలుగుతో పాటు వివిధ భాషల్లో ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేశారు. హిందీలో ఈ సినిమా ఒక రేంజ్ లో జెండా ఎగరేసింది. ఇక తమిళంలో కూడా 30 కోట్లు వసూలు చేసింది. 'బాహుబలి' .. 'బాహుబలి 2' తరువాత, అక్కడ ఈ స్థాయి వసూళ్లను రాబట్టిన సినిమా ఇదేనని అంటున్నారు. నిజంగా ఇది ఒక రికార్డేనని చెబుతున్నారు.

ఇక ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నుంచి కూడా ఈ సినిమాకి అనూహ్యమైన స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. దాంతో అల్లు అర్జున్ ఇప్పుడు ఫుల్ ఖుషీగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన దుబాయ్ లో ఉన్నాడని అంటున్నారు. త్వరలోనే 'పుష్ప 2' రెగ్యులర్ షూటింగు మొదలుపెట్టనున్నట్టు చెబుతున్నారు.