జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీలో చేగొండి సూర్యప్రకాశ్ కు చోటు

28-01-2022 Fri 17:11
  • కీలక నియామకాలకు పవన్ పచ్చజెండా
  • పీఏసీ సభ్యుడిగా చేగొండి సూర్యప్రకాశ్ నియామకం
  • 2018లో జనసేనలో చేరిన సూర్యప్రకాశ్
  • సూర్యప్రకాశ్ చేగొండి హరిరామజోగయ్య కుమారుడు
Pawan Kalyan appointed Chegondi Suryaprakash as Janasena PAC member
జనసేన పార్టీలో కీలక నియామకాలకు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆమోదముద్ర వేశారు. జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ) సభ్యుడిగా చేగొండి సూర్యప్రకాశ్ ను నియమించారు. సూర్యప్రకాశ్ సీనియర్ రాజకీయవేత్త, కాపు సామాజికవర్గ ప్రముఖుడు చేగొండి హరిరామజోగయ్య కుమారుడు. 2018లో ఆయన జనసేన పార్టీలో చేరారు.

ఇక, పవన్ కల్యాణ్ కాకినాడ, రాజమండ్రి, తిరుపతి, ఒంగోలు నగర జనసేన పార్టీ అధ్యక్షులను కూడా నియమించారు. కాకినాడకు సంగిశెట్టి అశోక్, రాజమండ్రికి యర్నాగుల శ్రీనివాసరావు, తిరుపతికి జగదీశ్ రాజారెడ్డి, ఒంగోలుకు మలగా రమేశ్ లను పార్టీ అధ్యక్షులుగా నియమించారు.