ఉద్యోగ ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

28-01-2022 Fri 13:50
  • మేమేం కొత్త ప్రమాణాలను నిర్దేశించలేం
  • ఆ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే
  • కేడర్ వారీగా ఖాళీల లెక్క చూసి రిజర్వేషన్ ఇవ్వాలి
  • రిజర్వేషన్ల నిబంధలను నిర్వీర్యం చేయలేమన్న ధర్మాసనం
We Can Not Lay Down A New Yard Stick On SC ST Promotions Says Supreme Court
ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రమోషన్లకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల నిబంధనలను నిర్వీర్యం చేయలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అందుకోసం సరికొత్త ప్రమాణాలను నిర్దేశించలేమని పేర్కొంది. జస్టిస్ నాగేశ్వరరావు, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బి.ఆర్. గవాయిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఇవాళ జరిగిన విచారణలో స్పష్టం చేసింది.

ఉద్యోగ ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీలకు న్యాయం జరగడం కోసం తామేమీ కొత్త ప్రమాణాలను తీసుకురాలేమని, అది చేయాల్సింది వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలని తేల్చి చెప్పింది. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను అమలు చేసేముందు కేడర్ వారీగా ఉద్యోగుల ఖాళీల లెక్కలు తీసుకోవాలని పేర్కొంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే విధిగా సమీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. వివిధ రాష్ట్రాల నుంచి దాఖలైన 133 వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు విచారణ చేసింది.