JNTU: రబ్బరుతో రోడ్లు.. జేఎన్టీయూ (ఏ)లో పరిశోధనలు

  • రూ.1,75,23,000 మంజూరు చేసిన కేంద్రం
  • సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో స్పెషల్ క్యాంపస్
  • ప్రాజెక్ట్ హెడ్ గా ప్రొఫెసర్ భానుమూర్తి
JNTU A To Research On Roads with Rubber

మామూలుగా అయితే తారు, సిమెంట్ తో రోడ్లను వేస్తుంటారు. అయితే, రబ్బర్ తో రోడ్లను పోసే కొత్త సాంకేతికతపై ఏపీలోని జేఎన్టీయూ (ఏ)లో పరిశోధనలకు రంగం సిద్ధం చేశారు. అనంతపురం జేఎన్టీయూ వర్సిటీలోని సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో రోడ్ల నిర్మాణాల్లో రబ్బరును వాడే అంశాలపై పరిశోధన చేయనున్నారు. దాని కోసం కాలేజీలో స్పెషల్ క్యాంపస్ ను ఏర్పాటు చేయనున్నారు.

దాని కోసం కేంద్ర రహదారుల ప్రాధికార మంత్రిత్వశాఖ వచ్చే నాలుగేళ్ల కాలానికిగానూ రూ.1,75,23,000 మంజూరు చేసింది. ప్రాజెక్టుకు సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్ మెంట్ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ పి.ఆర్. భానుమూర్తి మెంటార్ గా వ్యవహరించనున్నారు.

More Telugu News