Puri Jagannadh: విజయ్ దేవరకొండతో పూరి 'జనగణమన'?

  • షూటింగు దశలో 'లైగర్'
  • ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు
  • ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా
  • 'జనగణమన' కథేనంటూ టాక్
Puri Upcoming movies

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇంతకుముందు వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' సంచలన విజయాన్ని సాధించింది. ఆ తరువాత సినిమాగా ఆయన 'లైగర్'ను రూపొందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ చిత్రీకరణను జరుపుకుంది. విజయ్ దేవరకొండ బాక్సర్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఆయన జోడీగా అనన్య పాండే అందాల సందడి చేయనుంది.

ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. అందువల్లనే పూరి కాస్త టైమ్ తీసుకుని చేస్తున్నాడు. లేదంటే ఈ పాటికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసేదే.  ఆగస్టులో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఆ తరువాత కూడా విజయ్ దేవరకొండతోనే పూరి మూవీ ఉండనున్నట్టుగా చెబుతున్నారు.

గతంలో మహేశ్ బాబుతో 'జనగణమన' సినిమా చేయడానికి పూరి ప్రయత్నించాడుగానీ కుదరలేదు. ఇప్పుడు అదే కథతో విజయ్ దేవరకొండతో చేయనున్నాడని అంటున్నారు. ఆ కథను ఆయన విజయ్ దేవరకొండకి చెప్పడం కూడా జరిగిపోయిందని అంటున్నారు. అయితే 'లైగర్' రిజల్టుపైనే నెక్స్ట్ ప్రాజెక్టు ఆధారపడి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

More Telugu News