భారత రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి, ప్రజలకు కృతజ్ఞతలు: సత్య నాదెళ్ల

28-01-2022 Fri 11:37
  • పద్మభూషణ్‌ అవార్డు స్వీకరించడం గౌరవంగా భావిస్తున్నాను
  • మీ అందరితో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నాను
  • సాంకేతికతను మీకు మ‌రింత‌ చేరువ చేసేందుకు కృషి చేస్తానన్న సత్య నాదెళ్ల
satya nadella says thanks to indians
భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్‌ అవార్డు స్వీకరించడం గౌరవంగా భావిస్తున్నానని మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల తెలిపారు. భారత రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి, ప్రజలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాన‌ని అన్నారు.

''మీ అందరితో కలిసి పనిచేసేందుకు, భారతీయులు మరిన్ని విజయాలు సాధించేలా సాంకేతికతను మీకు చేరువ చేసేందుకు ఎదురుచూస్తున్నాను'' అని సత్య నాదెళ్ల ట్వీట్ చేశారు, కాగా, 2014, ఫిబ్రవరిలో స‌త్య‌ నాదెళ్ల‌ మైక్రోసాఫ్ట్‌ సీఈవోగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. గ‌త ఏడాది జూన్‌లో ఆ కంపెనీ ఛైర్మన్‌గానూ బాధ్య‌త‌లు చేప‌ట్టారు.