actress: బాలీవుడ్ నటి శ్వేతా తివారీ అభ్యంతరకర వ్యాఖ్యలు.. ఎఫ్ఐఆర్ నమోదు

FIR against Shweta Tiwari for hurting religious sentiments with bra comment
  • నా బ్రా సైజును దేవుడే తీసుకుంటున్నాడు
  • ఇది చాలా మందికి నచ్చదంటున్న శ్వేత 
  • విచారణకు మధ్యప్రదేశ్ హోంశాఖ మంత్రి ఆదేశాలు  
బాలీవుడ్, టీవీ సీరియళ్ల నటి శ్వేతా తివారీ తన వ్యాఖ్యలతో వివాదానికి ఆజ్యం పోశారు. దేవుడి విషయంలో కొందరి మనోభావాలను గాయపరిచేలా మాట్లాడారు. ఆమె నటించిన ఒక వెబ్ సిరీస్ ప్రారంభ కార్యక్రమం భోపాల్ లో జరిగింది. ఈ సందర్భంగా శ్వేతా తివారీ మాట్లాడుతూ.. "నా బ్రా సైజును దేవుడే తీసుకుంటున్నాడు. చాలా మందికి ఇది నచ్చడం లేదు’’ అంటూ వ్యాఖ్యానించారు.  

ఈ వ్యాఖ్యలు మధ్యప్రదేశ్ హోంశాఖ మంత్రి నరోత్తమ్ మిశ్రా దృష్టికి వెళ్లాయి. ‘‘నేను శ్వేతా తివారీ ప్రకటన చూశాను. దీన్ని ఖండిస్తున్నా. దీనిపై దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని భోపాల్ పోలీస్ కమిషనర్ ను ఆదేశించాను. ఆ తర్వాత చర్యలు తీసుకుంటాం’’ అని మంత్రి ప్రకటించారు. ఆయన ఆదేశాలతో శ్వేతా తివారీకి వ్యతిరేకంగా ఐపీసీ సెక్షన్ 295(ఏ) కింద శ్యామలాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
actress
Shweta Tiwari
FIR
bhopal
web series

More Telugu News