ఆ ముగ్గురూ మమ్మల్ని బెదిరిస్తున్నారు: పోలీసులకు ఫిర్యాదు చేసిన అజారుద్దీన్

28-01-2022 Fri 08:21
  • హెచ్‌సీఏ నుంచి సస్పెండ్ అయిన వారి నుంచి బెదిరింపులు
  • హెచ్‌సీఏ సిబ్బందిని బెదిరిస్తున్నారని ఫిర్యాదు
  • న్యాయ నిపుణులతో చర్చించాకే ముందుకెళ్తామన్న పోలీసులు
Azharuddin files complaint against suspended HCA members
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి సస్పెండైన ముగ్గురు వ్యక్తులు తనను, జింఖానా గ్రౌండ్స్‌లోని హెచ్‌సీఏ కార్యాలయ సిబ్బందిని బెదిరిస్తున్నారంటూ టీమిండియా మాజీ సారథి, హెచ్‌సీఏ చీఫ్ మహమ్మద్ అజారుద్దీన్ బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. హెచ్‌సీఏలో ఇటీవల జరిగిన గొడవల అనంతరం విజయానంద్, నరేష్ శర్మతోపాటు మరొకరు సస్పెండ్ అయ్యారు.

ఇప్పుడు వీరు తమను బెదిరిస్తున్నారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో అజర్ ఆరోపించారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు మాత్రం నమోదు చేయలేదు. న్యాయ నిపుణులతో చర్చించిన అనంతరం ఈ విషయంలో ముందుకెళ్తామని బేగంపేట పోలీసులు తెలిపారు.