'శ్రీవల్లి' పాటకు స్టెప్పులేసిన విండీస్ దిగ్గజం... వీడియో ఇదిగో!

27-01-2022 Thu 21:02
  • పుష్ప చిత్రంలో శ్రీవల్లి పాటకు విపరీతమైన క్రేజ్
  • బన్నీ స్టెప్పులకు సెలబ్రిటీలు ఫిదా
  • ముఖ్యంగా క్రికెట్ లోకం నుంచి విశేషమైన స్పందన
  • బన్నీలాగా స్టెప్పులేస్తున్న క్రికెటర్లు
Dwayne Bravo features Srivalli song
అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప చిత్రం క్రేజ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ చిత్రంలోని పాటలు సెలబ్రిటీలను సైతం ఆకట్టుకుంటున్నాయి. అంతేకాదు, ఆ పాటల్లో బన్నీ స్టెప్పులను అనుకరిస్తూ వీడియోలు పెట్టే వారి సంఖ్య నానాటికి అధికమవుతోంది.

తాజాగా, ఈ జాబితాలో వెస్టిండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో కూడా చేరాడు. పుష్ప చిత్రంలోని శ్రీవల్లి పాటకు బ్రావో స్టెప్పులేశాడు. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పంచుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.

శ్రీవల్లి పాటకు ఇప్పటికే చాలామంది క్రికెటర్లు డ్యాన్స్ చేశారు. డేవిడ్ వార్నర్, హార్దిక్ పాండ్య, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, సురేశ్ రైనా తదితరులు బన్నీ స్టయిల్ లో డ్యాన్స్ చేశారు. తాజాగా, బ్రావో శ్రీవల్లి హిందీ వెర్షన్ కు డ్యాన్స్ చేశాడు. అంతేకాదు, ఎలా డ్యాన్స్ చేశానంటూ డేవిడ్ వార్నర్, సురేశ్ రైనాలను ప్రశ్నించాడు. 'ట్రెండ్ తో పాటే మనం కూడా..' అంటూ తన పోస్టుపై బ్రావో వ్యాఖ్యానించాడు.