విజయవాడ కేంద్రంగా వంగవీటి రంగా జిల్లా డిమాండ్ ఏదైనా ఉంటే చెప్పాలి: మంత్రి పేర్ని నాని

27-01-2022 Thu 20:39
  • రాష్ట్రంలో జిల్లాల విభజన  
  • కొత్తగా 26 జిల్లాల ఏర్పాటు
  • అభ్యంతరాలుంటే చెప్పాలన్న మంత్రి  
  • పాలనా సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలు అని వెల్లడి
Minister Perni Nani opines on new districts
ఏపీలో 13 జిల్లాలను ప్రభుత్వం 26 జిల్లాలుగా రెట్టింపు చేయడం తెలిసిందే. దీనిపై ఏపీ మంత్రి పేర్ని నాని వివరణ ఇచ్చారు. జిల్లాల పునర్ వ్యవస్థీకరణ, జిల్లా కేంద్రాలపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే చెప్పాలని అన్నారు. విజయవాడ కేంద్రంగా వంగవీటి రంగా జిల్లా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉంటే తమకు చెప్పాలని తెలిపారు. మెజారిటీ ప్రజల ఆమోదాన్నే పరిగణనలోకి తీసుకుంటామని అన్నారు. గతంలో ప్రజలకు అందుబాటులో లేకుండా జిల్లా కేంద్రాలు ఉండేవన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసమే జిల్లాల విభజన అని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు.