తెలంగాణలో కొత్తగా 3,944 కరోనా కేసులు

27-01-2022 Thu 20:06
  • గత 24 గంటల్లో 97,549 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 1,372 కొత్త కేసులు
  • రాష్ట్రంలో ముగ్గురి మృతి
  • ఇంకా 39,520 మందికి చికిత్స
Telangana corona update
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 97,549 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా... 3,944 కొత్త కేసులు నమోదయ్యాయి.

జీహెచ్ఎంసీ పరిధిలో 1,372 పాజిటివ్ కేసులు వెల్లడి కాగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 288, రంగారెడ్డి జిల్లాలో 259, ఖమ్మం జిల్లాలో 135, సంగారెడ్డి జిల్లాలో 120, హనుమకొండ జిల్లాలో 117, నిజామాబాద్ జిల్లాలో 105, సిద్దిపేట జిల్లాలో 104, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 101 కేసులు గుర్తించారు.

అదే సమయంలో 2,444 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,51,099 మంది కరోనా బారినపడగా, వారిలో 7,07,498 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 39,520 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,081కి పెరిగింది.