ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటుపై సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి కొడాలి నాని

27-01-2022 Thu 19:55
  • ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు
  • విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లా
  • స్పందించిన కొడాలి నాని
  • చిన్నవాడైనా జగన్ కు పాదాభివందనం చేస్తున్నట్టు వెల్లడి
Minister Kodali Nani thanked CM Jagan over NTR District
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లాను ఏర్పాటు చేయనుండడం తెలిసిందే. దీనిపై ఏపీ మంత్రి కొడాలి నాని స్పందించారు. ఏపీలో ఎన్టీఆర్ పేరిట జిల్లాను ఏర్పాటు చేస్తున్నందుకు ఎన్టీఆర్ అభిమానుల తరఫున సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు. జగన్ తనకంటే వయసులో చిన్నవాడైనా, ఎన్టీఆర్ అభిమానిగా ఆయనకు పాదాభివందనం చేస్తున్నానని తెలిపారు.

కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ జిల్లాగా పేరుపెడతానని జగన్ 2018లోనే వెల్లడించారని కొడాలి నాని తెలిపారు. టీడీపీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఆ పనిచేయలేకపోయిందని విమర్శించారు. సుపరిపాలన అందించాలన్నదే జగన్ లక్ష్యమని, పరిపాలనా సౌలభ్యం కోసమే కొత్త జిల్లాల ఏర్పాటు అని కొడాలి నాని వివరించారు.