'హేయ్ సినామికా' చిత్రం నుంచి పాటను విడుదల చేసిన ప్రభాస్, రష్మిక

27-01-2022 Thu 19:34
  • దుల్కర్ సల్మాన్, కాజల్ అగర్వాల్ జంటగా చిత్రం
  • కొరియోగ్రాఫర్ బృంద దర్శకత్వంలో హేయ్ సినామిక
  • త్వరలోనే రిలీజ్
Prabhas and Rashmika launched song from Hey Sinamika
దుల్కర్ సల్మాన్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన చిత్రం 'హేయ్ సినామికా'. కొరియోగ్రాఫర్ బృంద దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం నుంచి 'ప్రాణం' అనే సాంగ్ ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, అందాలభామ రష్మిక మందన్న నేడు విడుదల చేశారు. గోవింద్ వసంత సంగీతం అందించగా, రాంబాబు గోసాల సాహిత్యం అందించారు. జియో స్టూడియోస్ బ్యానర్ పై రూపుదిద్దుకున్న ఈ చిత్రం పలు భాషల్లో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో అదితిరావు హైదరీ కీలకపాత్రలో కనిపించనుంది.