కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదాను కేసీఆరే అడ్డుకున్నారు: జీవన్ రెడ్డి

27-01-2022 Thu 19:14
  • ప్రాజెక్టు అంశంలో కేసీఆర్ పై జీవన్ రెడ్డి ధ్వజం
  • కేసీఆర్ లోపాలు బయటపడతాయని భయం 
  • కమీషన్ల కక్కుర్తి తెలిసిపోతుందని భయమని వ్యాఖ్యలు
Jeevan Reddy slams CM KCR over Kaleswaram Project
కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సీఎం కేసీఆర్ పై ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా రాకుండా అడ్డుకున్నది కేసీఆరేనని ఆరోపించారు. ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా వస్తే కేసీఆర్ లోపాలు బయటపడతాయని, కమీషన్ల కక్కుర్తి అంతా ప్రజలకు తెలిసిపోతుందని భయమని విమర్శించారు. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణను కేంద్రం చేతుల్లోకి వెళ్లనివ్వడంలేదని జీవన్ రెడ్డి ఆరోపణలు చేశారు. కేసీఆర్ చేసిన అప్పులకు రాష్ట్ర ప్రజలు నష్టపోతున్నారని వ్యాఖ్యానించారు.