ఏపీలో కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి... పూర్తి వివరాలు ఇవిగో!

27-01-2022 Thu 19:02
  • గత 24 గంటల్లో 41,771 కరోనా పరీక్షలు
  • 13,474 మందికి పాజిటివ్
  • రాష్ట్రంలో 9 మంది మృతి
  • ఇంకా 1,09,493 మందికి చికిత్స
AP Corona Update
ఏపీలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. గడచిన 24 గంటల్లో 41,771 కరోనా పరీక్షలు నిర్వహించగా... 13,474 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

కడప జిల్లాలో అత్యధికంగా 2,031 కొత్త కేసులు నమోదు కాగా, కర్నూలు జిల్లాలో 1,835 కేసులు, విశాఖ జిల్లాలో 1,349 కేసులు, గుంటూరు జిల్లాలో 1,342 కేసులు, ప్రకాశం జిల్లాలో 1,259 కేసులు, తూర్పు గోదావరి జిల్లాలో 1,066 కేసులు, నెల్లూరు జిల్లాలో 1,007 కేసులు వెల్లడయ్యాయి.

అదే సమయంలో 10,290 మంది కరోనా నుంచి కోలుకోగా, 9 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 22,36,047 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 21,11,975 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,09,493 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,579కి పెరిగింది.