'విక్రమ్' మాంఛి స్పీడ్ చూపించాడే!

27-01-2022 Thu 17:59
  • కమల్ సొంత సినిమాగా 'విక్రమ్'
  • దర్శకుడిగా లోకేశ్ కనగరాజ్
  • వచ్చేనెలలో షూటింగు పూర్తి
  • కీలక పాత్రల్లో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్  
Vikram movie update
కమలహాసన్ కథానాయకుడిగా లోకేశ్ కనగరాజ్ 'విక్రమ్' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి నిర్మాత కూడా కమలహాసనే. ఆయన సొంత బ్యానర్లో ఈ సినిమా నిర్మితమవుతోంది. కరోనా కారణంగా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడమే ఆలస్యంగా వెళ్లింది. ఆ తరువాత లాక్ డౌన్ల కారణంగా మరింత ఆలస్యమైంది.

ఈ మధ్యలో కమల్ కి కూడా కరోనా వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఎంతవరకూ షూటింగు అయింది? .. ఎప్పటికి పూర్తవుతుంది? అనేది అందరిలో కుతూహలాన్ని రేకెత్తిస్తోంది. అయితే ఈ సినిమా షూటింగు దాదాపు పూర్తయిందని దర్శకుడు లోకేశ్ కనగరాజ్ చెప్పారు. వచ్చేనెలలో షూటింగు పార్టు పూర్తవుతుందని అన్నారు.

ఈ సినిమాను మార్చి 31వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. మరి అప్పటికి అన్ని పనులు పూర్తవుతాయో లేదో చూడాలి. విజయ్ సేతుపతి .. ఫాహద్ ఫాజిల్ .. నరేన్ కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు. అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, ఒక చిత్రమైన స్వభావాన్ని కలిగిన వ్యక్తిగా కొత్త కమల్ ను అభిమానులు చూడనున్నారు.