కర్నూలు జిల్లాలో బీజేపీ నేతల దాడి.. ఇద్దరు వైసీపీ మద్దతుదారుల దారుణ హత్య

27-01-2022 Thu 15:12
  • కౌతల మండలం కామవరంలో జంట హత్యలు
  • వేటకొడవళ్లతో నరికి, పెట్రోల్ పోసి అంటించిన వైనం
  • హత్యలకు భూవివాదమే కారణం
Two YSRCP leaders murdered in Kurnool district
కర్నూలు జిల్లాలో పాత కక్షలు భగ్గుమన్నాయి. ఇద్దరు వ్యక్తులను ప్రత్యర్థులు దారుణంగా హతమార్చారు. కౌతల మండలం కామవరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వైసీపీకి చెందిన శివప్ప, ఈరన్నలపై బీజేపీకి చెందిన మల్లికార్జున, ఆయన వర్గీయులు దాడి చేసి.. వేటకొడవళ్లతో నరికి, ఆపై పెట్రోల్ పోసి నిప్పంటించారు.

శివప్ప, ఈరన్నకు.. మల్లికార్జునతో భూవివాదం ఉంది. వీరిలో శివప్ప వర్గం వైసీపీలో, మల్లికార్జున వర్గం బీజేపీలో కొనసాగుతోంది. భూతగాదా విషయం గురించి మాట్లాడేందుకు ఈ ఉదయం రెండు వర్గాలు వెళ్లిన సమయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ క్రమంలోనే శివప్ప, ఈరన్నలు దారుణ హత్యకు గురయ్యారు.