Astronomy: పాలపుంతలో వింత వస్తువు.. ప్రతి 18.18 నిమిషాలకో సిగ్నల్

  • భూమికి 4 వేల కాంతి సంవత్సరాల దూరంలో గుర్తింపు
  • ప్రాజెక్ట్ వర్క్ లో భాగంగా గుర్తించిన ఆస్ట్రేలియా విద్యార్థి
  • ‘అల్ట్రా లాంగ్ పీరియడ్ మాగ్నెటార్’గా పిలుస్తున్న వైనం
Strange Object Found In Milky Way Sending Radio Signal For Every 18 minutes

కొన్ని వేల కాంతి సంవత్సరాల దూరంలోని పాలపుంతలో ఓ వింత వస్తువును శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ వింత వస్తువేంటన్నది తేల్చే పనిలో ఉన్నారు. ప్రతి 18.18 నిమిషాలకు ఓ రేడియో సిగ్నల్ ను అది భూమికి పంపిస్తోందని అంటున్నారు. డిగ్రీ ప్రాజెక్ట్ వర్క్ లో భాగంగా ఓ విద్యార్థి మొదట దానిని గుర్తించాడు. వెస్టర్న్ ఆస్ట్రేలియాలోని మర్కిసన్ వైడ్ ఫీల్డ్ అర్రేలో టెలిస్కోప్ సాయంతో ఆ విద్యార్థి దీనిని గుర్తించాడు. దానిని ప్రస్తుతానికి ‘అల్ట్రా లాంగ్ పీరియడ్ మాగ్నెటార్’ అని పిలుస్తున్నారు.

నటాషా హర్లీ వాకర్ అనే భౌతికశాస్త్రవేత్త దానిని విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం అది భూమికి 4 వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నట్టు తేల్చారు. చాలా కాంతిమంతంగా ఉందని, దాని అయస్కాంత క్షేత్రం అత్యంత ప్రబలంగా ఉందని గుర్తించారు. ఎప్పటి నుంచో అది పాలపుంతలో ఉండి ఉండవచ్చునని, అయితే, ఇప్పటిదాకా ఎవరూ గుర్తించలేకపోయారని అంటున్నారు.

తానూ మొదట ఆ సిగ్నళ్లు ఏలియన్స్ పనేనని అనుకున్నానని, కానీ, అంతా విశ్లేషించాక ఆ మిస్టరీ వస్తువు నుంచి వస్తున్న సిగ్నళ్లు రకరకాల తరంగదైర్ఘ్యాలతో ఉన్నాయని నటాషా చెప్పారు. కాబట్టి అవి కృత్రిమ సిగ్నల్స్ అయి ఉండే అవకాశమే లేదని, సహజంగా వస్తున్నవేనని అన్నారు.

More Telugu News