ప్రభుత్వం ముందు చూపుతో ఆలోచించింది: కొత్త‌ జిల్లాల ఏర్పాటుపై బీజేపీ నేత విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి ప్రశంస

27-01-2022 Thu 13:59
  • రాయలసీమకు సాగరతీరం కలపడం మంచిది
  • ఈ నిర్ణయం అభినందనీయం
  • నూతన ఆంధ్ర‌ ప్రదేశ్ కు శుభాకాంక్షలు
vishnu vardhan reddy on new districts
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొత్త జిల్లాలు, వాటి కేంద్రాల గురించి వైసీపీ స‌ర్కారు ప్ర‌క‌ట‌న చేసిన విష‌యం తెలిసిందే. దీనిపై ప‌లువురు త‌మ అభిప్రాయాలు తెలుపుతున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటును బీజేపీ స‌మ‌ర్థిస్తుండ‌డం గ‌మ‌నార్హం. తాజాగా, బీజేపీ ఏపీ నేత విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి దీనిపై స్పందించారు.

''కొత్త జిల్లాల ఏర్పాటుతో రాయలసీమకు సాగరతీరం కలపడం ప్రభుత్వం ముందు చూపుతో ఆలోచించింది. ఈ నిర్ణయం అభినందనీయం. నూతన ఆంధ్ర‌ప్రదేశ్ కు శుభాకాంక్షలు'' అని విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి ట్వీట్ చేశారు.