ఈ ప‌రిస్థితుల నుంచి బ‌య‌ట‌ప‌డేయాల‌ని దేవుడిని కోరుకుంటున్నాను: హీరో నిఖిల్ ఆవేద‌న‌

27-01-2022 Thu 13:53
  • క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావం కెరీర్ల‌పై బాగా ప‌డుతోంది
  • నాలుగు సినిమాల‌కు ఒప్పుకున్నా
  • విడుద‌ల తేదీలన్నీ మా నియంత్ర‌ణ‌లో లేకుండా పోయాయి
Nikhil Very sad to c this Pandemic affect
సినీ ప‌రిశ్ర‌మ‌నూ దెబ్బ తీస్తోన్న క‌రోనాపై ప‌లువురు హీరోలు ఆందోళ‌న‌తో ఉన్న‌ట్లు తెలుస్తోంది. తాజాగా టాలీవుడ్ హీరో నిఖిల్ ఆందోళ‌న వ్య‌క్తం చేస్తూ ట్వీట్ చేశాడు. క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావం త‌మ‌ కెరీర్ల‌పై బాగా ప‌డుతోంద‌ని ఆయ‌న అన్నాడు. అర్జున్ సుర‌వ‌రం సినిమా విజ‌య‌వంత‌మైన త‌ర్వాత తాను నాలుగు సినిమాల‌కు ఒప్పుకున్నాన‌ని, ఆ నాలుగు సినిమాల స్క్రిప్టులు త‌న‌కు బాగా న‌చ్చాయ‌ని తెలిపాడు.

అయితే, వాటి విడుద‌ల తేదీలన్నీ త‌మ నియంత్ర‌ణ‌లో లేకుండా పోయాయ‌ని నిఖిల్ చెప్పాడు. ఈ ప‌రిస్థితుల నుంచి బ‌య‌ట ప‌డేయాల‌ని, సినిమాల‌ను అనుకున్న స‌మ‌యానికి విడుద‌ల చేసేలా చూడాల‌ని దేవుడిని కోరుకుంటున్నాన‌ని చెప్పాడు.