Rajinikanth: రజనీకాంత్ తీవ్ర మనోవేదనలో ఉన్నారంటూ కథనాలు!

Rajinikanth is very disturbed with his daughters life
  • విడిపోయిన కూతురు ఐశ్వర్య, అల్లుడు ధనుష్
  • విడిపోతున్నట్టు జనవరి 17న ప్రకటించిన జంట
  • గతంలో ఎప్పుడు వివాదం వచ్చినా పరిష్కరించిన రజనీ

సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య తన భర్త, హీరో ధనుష్ తో విడిపోయిన సంగతి తెలిసిందే. ఏళ్ల పాటు వైవాహిక జీవితాన్ని పంచుకున్న ఈ జంట జనవరి 17న విడిపోతున్నట్టు ప్రకటించింది. వీరు విడిపోయిన వార్తతో అందరూ షాక్ కు గురయ్యారు. రజనీకాంత్ సైతం తీవ్ర మనోవేదనకు గురవుతున్నారట.

తన కూతురు, అల్లుడిని కలిపేందుకు రజనీ ఎంతో ప్రయత్నిస్తున్నట్టు కథనాలు వస్తున్నాయి. ఇద్దరి మధ్య ఏర్పడిన ఎడబాటు తాత్కాలికమేనని రజనీ బలంగా నమ్ముతున్నారట. వాస్తవానికి ఐశ్వర్య-ధనుష్ మధ్య గతంలో కూడా విభేదాలు వచ్చిన ప్రతిసారి రజనీకాంత్ వివాదాలను పరిష్కరించి, ఇద్దరినీ కలిపేవారట. కానీ ఈసారి ఇద్దరూ విడిపోవడానికే నిశ్చయించుకోవడంతో రజనీ ఎంతో ఆవేదనకు గురవుతున్నారట.

  • Loading...

More Telugu News