Ramcharan: శంకర్ మూవీ నుంచి చరణ్ ఫస్టు లుక్ వచ్చేది ఆ రోజేనట!

  • రిలీజ్ కి రెడీగా 'ఆర్ ఆర్ ఆర్'
  • షూటింగు దశలో శంకర్ సినిమా
  • మార్చి 27వ తేదీన ఫస్టులుక్
  • లైన్లో సుకుమార్, గౌతమ్ తిన్ననూరి
shankar and Charan movie update

చరణ్ తాజా చిత్రంగా ప్రేక్షకులను పలకరించడానికి 'ఆర్ ఆర్ ఆర్' రెడీగా ఉంది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు. మార్చిలో గానీ .. ఏప్రిల్లో గాని ఈ సినిమాను రిలీజ్ చేయవచ్చని అంటున్నారు. ఆ తరువాత సినిమాను ఆయన శంకర్ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే.

దిల్ రాజు నిర్మిస్తున్న 50వ సినిమా ఇది. అందువలన ఆయన ఈ సినిమా విషయంలో మరింత కేర్ తీసుకుంటున్నారు. ఆల్రెడీ ఈ సినిమా రెండు షెడ్యూల్స్ ను పూర్తిచేసుకుంది. తదుపరి షెడ్యూల్ షూటింగుకి సన్నాహాలు జరుగుతున్నాయి. చరణ్ పుట్టినరోజైన మార్చి 27వ తేదీన ఆయన ఫస్టులుక్ ను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట.

ఈ సినిమాలో చరణ్ సరసన నాయికగా కియారా అద్వాని అలరించనుంది. గతంలో ఆమె చరణ్ సరసన 'వినయ విధేయ రామ'లో సందడి చేసిన సంగతి తెలిసిందే. తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాలో, శ్రీకాంత్ .. అంజలి ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా తరువాత చరణ్ తో చేయడానికి సుకుమార్ .. గౌతమ్ తిన్ననూరి లైన్లో ఉన్నారు.

More Telugu News